మైథలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ సాంగ్ విడుదల
బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'.కొత్త కంటెంట్ ను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలని ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం 'అరణ్య ధార'ని రూపొందించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు మేకర్స్. తాజాగా 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ అయినటువంటి…
