Skip to content

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

ప్రముఖ నటుడు అలీ ఓ రియాలిటీ షో షూటింగ్‌ కోసం గోవా వెళ్లారు. అలీ షూటింగ్‌కు వచ్చిన సంగతి తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా వచ్చి తనను కలవాలని అలీకి చెప్పటంతో అలీ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిశారు. ఈ సందర్భంగా అలీగురించి తెలుసుకున్న ఆయన అలీతో మాట్లాడుతూ దాదాపు 1260 సినిమాల్లో నటించటం అంటే చాలా పెద్ద విషయం అంటూ అలీని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే గోవాలో జరిగే గోవా ఫిలిం ఫెస్టివల్‌ (జిఎఫ్‌ఎఫ్‌) కార్యక్రమానికి అతిథిగా రావాలని అలీని కోరటంతో ముఖ్యమంత్రి ప్రమోద్‌తో ఖచ్చితంగా పాల్గొంటానని మాటిచ్చారు. అంటే ఈ ఏడాది జరిగే ఫిలిం ఫెస్టివల్‌ వేడుకల్లో అలీ పాల్గొంటున్నారన్నమాట.

Read more

చిరంజీవి విశ్వంభర షూటింగ్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో UV క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత MM కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు. శ్యామ్ కాసర్ల రాసిన ఈ…

Read more

సుందరకాండ’ ఆగస్టు 27న రిలీజ్

హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్ గా రోహిత్ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. సుందరకాండ హ్యుమర్, సోల్ ఫుల్ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. ఈరోజు, నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. సుందరకాండ ఆగస్టు 27న గణేష్ చతుర్థి రోజున థియేటర్లలోకి వస్తుంది. బుధవారం విడుదలతో ఈ చిత్రం కు లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. రిలీజ్…

Read more

వార్‌ 2 ట్రైలర్‌ విడుదల

హృతిక్‌ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో ‘వార్‌ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది

Read more

నా కింగ్డమ్ కు సందీప్ వంగా చీఫ్ ఆర్కిటెక్ట్, గౌతమ్ తిన్ననూరి కొత్త ఆర్కిటెక్ట్ – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా మూవీ "కింగ్డమ్" ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కింగ్డమ్ బాయ్స్ పేరుతో సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రమోషన్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ 'నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారు..' అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ చేసిన ఆర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు. అలాగే గౌతమ్ డైరెక్షన్…

Read more

సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. ‘హరి హర వీరమల్లు’ గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై…

Read more

‘భద్రకాళి’ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: విజయ్ ఆంటోనీ

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా…

Read more

#Mega 157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్…

Read more

సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. సూర్య ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'కరుప్పు' ఫస్ట్ లుక్ టీజర్‌ సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్‌ అయింది. టీజర్ ఓ మాస్ పండుగలా ఉంటుంది. సూర్య పవర్‌ఫుల్…

Read more

యథార్థ ఘటనలతో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఉసురే’ అందరి హృదయాలను హత్తుకుంటుంది: సీనియర్‌ హీరోయిన్‌ రాశి

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్‌ అరుణాసలం, జననీ కునశీలన్‌ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్‌. సీనియర్‌ హీరోయిన్‌ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు…

Read more