మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ…
“కపుల్ ఫ్రెండ్లీ” విజయం నాపై బాధ్యత పెంచింది. – హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఈ రోజు ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రిలీజ్ ముందు ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోయే ప్రేమ కథ అవుతుందని చెప్పాను. నా మాటను నిజం చేస్తూ ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొదటగా దర్శకుడు అశ్విన్ కే ఇవ్వాలి. హానెస్ట్ గా సినిమాను రూపొందించాడు. యూవీ వంశీ, విక్కీ ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమాను నిర్మించారు. ఓ పెద్ద సినిమాకు తీసుకున్న శ్రద్ధ ఈ సినిమాకూ తీసుకుని దగ్గరుండి అన్ని వర్క్స్ చూసుకున్నారు. సంతోష్ శోభన్ టాలెంటెడ్ యాక్టర్. ప్రేమ కథా చిత్రాలకు ఆయన చిరునామా కావాలి. నాతో మాట్లాడిన దర్శక నిర్మాతలు సంతోష్ తో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. సంతోష్, వారణాసి, యూవీ సంస్థ నేనూ కలిసి మరో ప్రేమ కథను చేయబోతున్నాం. ఆ సినిమా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకు రిలీజ్ చేస్తాం. ఈ లవ్ ను ప్రేక్షకులకూ పంచేందుకు ఓ కాంటెస్ట్ రన్ చేస్తాం. మీకు మీ పార్టనర్ కు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయిన గిఫ్ట్ ను మేము అందించాలని అనుకుంటున్నాం. సంతోష్, మానసతో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు.పి. మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ మూవీ కథ విన్నప్పుడే ఈ చిత్రాన్ని హానెస్ట్ గా, జెన్యూన్ గా నిర్మించాలని అనుకున్నాం. సంతోష్, మానస కూడా వేరే మూవీస్ చేయకుండా కేవలం ఈ ప్రాజెక్ట్ మీదే దృష్టిపెట్టారు. ఆర్నెళ్ల ముందు ఈ మూవీ రెడీ అయినా, వాలెంటైన్స్ డేకు కరెక్ట్ గా ఉంటుందని ఆగి రిలీజ్ చేశాం. మా మూవీకి సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మా మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేసిన మీడియాకు థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే మా సినిమా ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్తోంది. మా టీమ్ తో పాటు థియేటర్స్ కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాను. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. ఈ ఆదరణ ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – ప్రీమియర్స్ నుంచే మా మూవీకి మీరు ఇస్తున్న రెస్పాన్స్ మాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్, మీడియా నుంచి వస్తున్న రివ్యూస్, సోషల్ మీడియాలో మా మూవీ గురించి వస్తున్న స్పందన ఇవన్నీ చూసి మా మనసు నిండిపోతోంది. మీ పర్సనల్ లైఫ్ లోని లవ్ మూవ్ మెంట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. సంతోష్ లాగే నేనూ ఓ మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాం. మేము కోరుకున్న సినిమా, మేము చేయాలనుకున్న కథ ఈ సినిమాతో మాకు దక్కింది. ధీరజ్ గారు మా మూవీకి ఎనర్జీ తీసుకొచ్చారు. అజయ్ గారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ విజయానికి కారణం. అన్నారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాలి అనేది మా కల. ఈ రోజు ఇన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సక్సెస్ కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్నా. ఒక మంచి కథను హానెస్ట్ గా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. నా ఫ్యామిలీ లాంటిది యూవీ సంస్థ. మా అజయ్ అన్నకు ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. మా కంటే ఎక్కువ ఎనర్జీతో మా ధీరజ్ థియేటర్స్ విజిట్ కు వస్తున్నారు. మానస ఇంకా మరెన్నో మంచి మూవీస్ చేస్తుంది. ఆమె మా సినిమాకు ప్రాణంలా నిలిచింది. ఒక మంచి దర్శకుడు అశ్విన్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశామనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ విజయం ఒక బాధ్యతను ఇచ్చింది. ఈ బాధ్యతను గుర్తుపెట్టుకుంటూ మీకు నచ్చే మంచి మూవీస్ చేయాలనుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్
