Skip to content

మహా శివరాత్రి సందర్భంగా మహా దేవుడిపై ‘శివ్ కైలాషోం కే వాసి’ పాటను పాడి ఆశ్చర్యపరిచిన రాశీ ఖన్నా

మహా శివరాత్రి సందర్భంగా మహా దేవుడిపై ‘శివ్ కైలాషోం కే వాసి’ పాటను పాడి ఆశ్చర్యపరిచిన రాశీ ఖన్నా Telugu News
మహా శివరాత్రి సందర్భంగా మహా దేవుడిపై ‘శివ్ కైలాషోం కే వాసి’ పాటను పాడి ఆశ్చర్యపరిచిన రాశీ ఖన్నా Telugu News

మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. శివుడిపై తనకున్న భక్తిని చాటుకునేలా రాశీ ఖన్నా ఈ పాటను ఆలపించారు. భారత దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివ భక్తితో ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌‌లతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివుడిపై తన భక్తిని చాటుకునేలా పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

తాను పాడిన పాటకు వస్తున్న ప్రశంసలపై రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంతరంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియత శక్తి అయిన అయిన మహా దేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది. ‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం కావడం, ఇలాంటి ఓ విశిష్టమైన రోజున పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాశీ తెలిపారు.

ఈ పాటలో రాశీ కనిపించిన తీరు, ఆమె వినయం, పలికించిన భావోద్వేగాలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆమె స్వరం సైతం ఎంతో వినసొంపుగా, వినడానికి మనసుకు ఎంతో హాయిగా అనిపించేలా ఉంది. ఆమె పాడుతున్న విధానంలో ఒక నిశ్శబ్ద ప్రకాశం, ప్రశాంతత ఉంది. ఇదొక భక్తిపూర్వకమైన నిజాయితీ ప్రదర్శనలా కాకుండా ప్రార్థనలా అనిపిస్తుంది.

అక్షయ్ కుమార్‌తో ప్రస్తుతం రాశీ ఖన్నా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ‘ఫర్జీ 2’, విక్రాంత్ మాస్సేతో కలిసి ‘తలఖోన్ మే ఏక్’, ఆర్. మాధవన్‌తో కలిసి ‘థ్రిల్లర్ బ్రిడ్’తోజ్ అనే చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం “శివ్ కైలాషోన్ కే వాసి” ద్వారా రాశీ ఖన్నా అభిమానుల్లో మరింత పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.