Skip to content

ఏప్రిల్ 4న ‘డెకాయిట్‌’ ట్రైలర్ రిలీజ్

ఏప్రిల్ 4న ‘డెకాయిట్‌’ ట్రైలర్ రిలీజ్ Telugu News
ఏప్రిల్ 4న ‘డెకాయిట్‌’ ట్రైలర్ రిలీజ్ Telugu News

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.
ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే ‘రుబారు’ చిచ్చుబుడ్డి పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రెండు భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ సభ్యులు మూవీ టీంని అభినందించారు.
అడివి శేష్ ‘డెకాయిట్‌’ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ చిత్రానికి భీమ్స్ బ్లాక్ బస్టర్ అల్బమ్ అందించారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.