Skip to content

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాలో శివ, మిత్ర జర్నీ ఎంగేజింగ్ గా ఉంటుంది – సంతోష్ శోభన్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టైటిల్ మార్చమని సెన్సార్ వారు అడిగారు. అయితే ఈ టైటిల్ తోనే సినిమా తెరకెక్కింది, ఈ టైటిల్ తోనే పబ్లిసిటీ చేశాం. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు టైటిల్ మార్చడం సరికాదని ఇదే టైటిల్ కొనసాగిస్తామని చెప్పాం. దాంతో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తమిళంలో మాత్రం ఇదే టైటిల్ తో యూఏ సర్టిఫికేషన్ సెన్సార్ నుంచి దక్కింది. ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఉంటుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. “కపుల్ ఫ్రెండ్లీ” ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు. ఈ చిత్రంతో మా హీరో సంతోష్ శోభన్ కు ఘన విజయం దక్కుతుందని, ఆయన స్టార్ హీరోల సరసన చేరుతారని ఆశిస్తున్నాం. సంతోష్ పర్ ఫార్మెన్స్ తో ప్రతి యువకుడు కనెక్ట్ అవుతాడు. మనమంతా అతని ఎమోషన్ ను మన ఎమోషన్ గా భావిస్తాం. మానస వారణాసి తన పాత్రకు లైఫ్ ఇచ్చింది. ఎక్కడా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. తెలుగు అమ్మాయి తను, ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అలాగే యూవీ సంస్థకు ఈ చిత్రంతో పాటు రాబోయే సినిమాలు కూడా సక్సెస్ ఇవ్వాలి. గురువారం చెన్నైతో పాటు హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడలో ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా మూవీ 14న రిలీజ్ అయితే 13న సాయంత్రం నుంచే అన్ని థియేటర్స్ లో షోస్ వేస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ట్రైలర్ బాగుందంటూ కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. మా డైరెక్టర్ తమిళ్ లో స్క్రిప్ట్ రాస్తే, మేము తెలుగులో డైలాగ్స్ మార్చుకుని ఆ డైలాగ్స్ లోని రిథమ్, టైమింగ్ పోకుండా ప్రాక్టీస్ చేసేవాళ్లం. ప్రతి మూవీలో తమకు పేరు రావాలని కష్టపడుతుంటారు. కానీ ఈ చిత్రంలో టీమ్ వర్క్ అంటే ఏంటో చూశాను. అందరికీ పేరు రావాలి, సినిమా ఆడియెన్స్ కు నచ్చాలని టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం పడిన కష్టం మీకు మూవీలో కనిపిస్తుంది. ధీరజ్ గారు మా టీమ్ లోకి వచ్చాక చాలా ఎనర్జీ వచ్చింది. మా సినిమాను థియేటర్స్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” మూవీకి ప్రతి ఒక్కరూ తమ సపోర్ట్ అందిస్తున్నారు. రీసెంట్ గా మేము చేసిన ప్రమోషనల్ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు సక్సెస్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ లోకి ధీరజ్ గారు వచ్చాక కొత్త స్ట్రెంత్ వచ్చినట్లు ఫీలయ్యాం. ఈ సినిమాకు నేను, మా ప్రొడ్యూసర్ అజయ్ అన్న, అశ్విన్ ఎంతో ధీరజ్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు నాలో కూడా డౌట్స్ ఉండేవి. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఈ కథలోని సోల్ ను మేము రివీల్ చేయకుండా ఉంచాం. అదేంటి అనేది థియేటర్ లోనే చూడాలి. మిత్ర, శివ జర్నీ ఈ సినిమా. మిత్ర తనకు పరిచయం అయ్యాక శివ లైఫ్ ఎలా మారింది, మిత్ర కోసం శివ ఎంతవరకు వెళ్లాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా చూపించబోతున్నాం. ఈ సినిమా ద్వారా మేము ఏం చెప్పాలనుకున్నది మాత్రం థియేటర్ లోనే చూడాలి. ప్రభాస్ అన్నను మేము అడగకముందే మా ట్రైలర్ ను ఇన్ స్టాలో షేర్ చేశారు. అది మా మీద ఉన్న ఫ్యూర్ లవ్ అనిపించింది. అంతకంటే అదృష్టం మాకు ఏముంటుంది. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్