Skip to content

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ లాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం: రాజీవ్ కనకాల

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’లో ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీరామ్ వెంకట్
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది.. నిలబడుతుంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్
జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ . ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందరి ఎఫర్ట్‌తోనే ఇదంతా సాధ్యమైంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ టైంలో శ్రీరామ్‌కి నేను ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ ఈ ప్రసాద్ రావు పాత్రను ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచీ శ్రీరామ్ ఈ సిరీస్ విజయం పట్ల నమ్మకంగా ఉండేవారు. రెబెకా పాత్రలో ఉదయ భాను ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ ఆమె ఎంతో డైనమిక్‌గా, పవర్ ఫుల్‌గా అనిపించారు. సిరీస్ చూసిన వారంతా కూడా కృష్ణ గారు రాసిన కథ, తీసిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మా అందరికీ ఇంత పేరు తీసుకు వచ్చేలా సిరీస్‌ను తీసిన కృష్ణ గారికి థాంక్స్. సిద్దు, కిరణ్మయి, శ్వేత ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం. మహేష్ మా అందరినీ చక్కగా చూపించారు. ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ చూడాలి. సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ని ప్రతీ ఒక్కరూ చూడాలి. ప్రస్తుత తరంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను చూపేలా మా దర్శకుడు కృష్ణ మంచి కథను తీసుకు వచ్చారు. జీ, కృష్ణ గారు, నేను కలిస్తేనే ఈ సక్సెస్ వచ్చింది. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. ఇందులోని ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అను మేడం గారు నాకు ఈ కెరీర్‌ను ఇచ్చారు. ఆమె గురించి ఒకనాడు నేను కచ్చితంగా మాట్లాడతాను. సిద్దు, కిరణ్మయి, శ్వేత గారు మాకెంతో సపోర్ట్‌గా ఉంటారు. మా సిరీస్‌ను చూసి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ సిరీస్‌ను ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లిన మీడియాకు థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనురాధా మేడం, జయంత్ గారికి, శ్రీరామ్ గారికి థాంక్స్. మా కోసం రాజీవ్ కనకాల గారు ఎంతో కష్టపడ్డారు. ఉదయభాను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. కథ విన్న తరువాత వాసంతిక ఎంతో ఎగ్జైట్ అయింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా? అన్నట్టుగా ఉండేది. ఈ కథలో నాతో పాటు ప్రయాణించిన ప్రభాకర్, కొండల్రావుకి థాంక్స్. ఎడిటింగ్‌లో వాసురెడ్డి, ఫైనల్‌ ఆర్ఆర్‌లో కిరణ్మయి, సిద్దు చాలా సహాయం చేశారు. మా సిరీస్‌ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ కదా.. కానీ డాటర్ ఆఫ్ ప్రసాద్ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది. జీ5 తెలుగులో చాలా ఏళ్లు నిలబడుతుంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్లెప్పుడూ చెడిపోలేదు. మేం కంటెంట్‌తో ఫ్యామిలీని నమ్మాం. ఆ నమ్మకం నిలబడింది. మా సిరీస్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
ఉదయభాను మాట్లాడుతూ .. ‘ఓ సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందా? అని నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు అందరూ వందకు వంద శాతం ఎఫెర్ట్ పెట్టారు. మా సిరీస్ గురించి, మా నటన గురించి వందల, వేల మెసెజ్‌లు వస్తున్నాయి. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన జీ5 టీంకు థాంక్స్. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీరామ్‌కి రుణపడిపోయాను. దర్శకుడు కృష్ణ గారు సిరీస్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. రెబెకా పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అయింది. సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. రాజీవ్ కనకాల సత్తాకు తగ్గ పాత్ర ఇన్ని రోజులకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంత మంచి సక్సెస్‌ను ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
వాసంతిక మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌లో స్వాతి లాంటి మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు కృష్ణ గారికి థాంక్స్. ఈ సిరీస్‌ను పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి చూడాలి. కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేం చూపించాం. ప్రతీ ఒక్కరూ నా పాత్రని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీంకు థాంక్స్’ అని అన్నారు.