Skip to content

‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో నా క్యామియో రోల్ యూనిక్ టైమింగ్ తో ఉంటుంది – శ్రీవిష్ణు

‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో నా క్యామియో రోల్ యూనిక్ టైమింగ్ తో ఉంటుంది – శ్రీవిష్ణు Telugu News
‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో నా క్యామియో రోల్ యూనిక్ టైమింగ్ తో ఉంటుంది – శ్రీవిష్ణు Telugu News

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ. “అందరికీ నమస్కారం. ‘గాయపడ్డ సింహం’ టీమ్‌కి కంగ్రాచులేషన్స్. అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి కారణం విజయ్, పవన్ — వాళ్లిద్దరి కోసం వచ్చాను. విజయ్‌తో నాకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. అలాగే పవన్‌తో కూడా నేను నెక్స్ట్ సినిమా ఇదే బ్యానర్‌లో చేస్తున్నాను. కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారికి ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మే 1న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థాంక్యూ సో మచ్.”

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్యూ. విప్లవ్ ఎడిటింగ్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. స్వీకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు చాలా బాగున్నాయి, బీజీఎమ్ అదిరిపోయింది. మానస నా సినిమాలో క్యామియో చేసింది కాబట్టి, నేను కూడా తన సినిమాలో చేశాను (నవ్వుతూ). డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన టైమింగ్ ఉంది. ఆ టైమింగ్‌ను ఈ సినిమాలో బాగా వాడుకున్నారని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ గారు కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు (నవ్వుతూ). పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదటి హీరోగా నేనే చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా నేను చేయడం ఆనందంగా ఉంది. విజయ్, భాను, కళ్యాణ్ — వీరంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ల కోసం నా వంతు కాంట్రిబ్యూషన్‌గా ఈ సినిమా చేశాను. ఈ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్యూ.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఈ సినిమాకు ఫస్ట్ హీరో పవన్ సాదినేని. ఆయన ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్లు లేరు. నాకు, తరుణ్‌కి చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా, కశ్యప్ వెనుక నిలబడ్డాడు . ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన క్యారెక్టర్, ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ వల్ల నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు తెలియకుండా శ్రీ విష్ణు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ సినిమాకి ఒక సమస్య వచ్చింది. ఈ సినిమాలో ట్రంప్ కార్డ్ ఉంది. కశ్యప్ ఇండియా–అమెరికాకు వార్ తీసుకురాగలిగాడు(నవ్వుతూ). శ్రీ విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కనిపిస్తారు. మీరు హాయిగా నవ్వుకోవాలంటే మే 1న ‘గాయపడ్డ సింహం’ తప్పకుండా చూడండి.

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి థాంక్స్. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. నా గాడ్ బ్రదర్ పవన్ సాదినేని — నేను భవిష్యత్తులో ఏ విజయాలు సాధించినా, దాని క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఈ వేడుకకు వచ్చిన నారా రోహిత్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేశారు. టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. మా నిర్మాతలు సినిమా మీద ప్యాషన్ ఉన్న వారు. వాళ్లకు డబ్బులు వస్తే, నా లాంటి వాళ్లకు లైఫ్ వస్తుంది. స్వీకర్ అగస్తి తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. జేడీ గారు, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు మంచి ఫ్రెండ్స్‌ను ఇచ్చింది. ఇందులో ట్రంప్ ఎలిమెంట్‌ను వినియోగించాం. శ్రీ విష్ణు గారి ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆయన ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో, క్రియేటివ్‌గా ఈ సినిమాను తీశారు. మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు. ఇందులో నాకు మంచి వైబ్ ఉన్న పాత్ర దక్కింది. డైరెక్టర్ కశ్యప్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోతుంది. మానస ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్‌మెంట్ ఈ సినిమా ఇస్తుంది. శ్రీ విష్ణు గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.”

హీరోయిన్ మానస చౌదరి మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన దర్శకులకు, నారా రోహిత్ గారికి, శ్రీవిష్ణు గారికి ధన్యవాదాలు. మా నిర్మాతలందరికీ థాంక్స్. తరుణ్ భాస్కర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. ఇందులో ఆయన పెర్ఫార్మెన్స్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. జేడీ గారు ఈ సినిమాకు మంచి వైబ్ తీసుకొచ్చారు. ఫారియా యాక్టింగ్‌తో పాటు డాన్స్ కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్‌లో ఫన్ ఉంటుంది. కడుపుబ్బ నవ్వుకుంటూ బయటికి వస్తారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి మాట్లాడుతూ… నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చిన భాను గారికి థాంక్స్. ఇలాంటి కమర్షియల్ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మా నిర్మాతలందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ కశ్యప్ గారు నాకు ఈ సినిమా కోసం చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్స్. శ్రీ విష్ణు గారి డబ్బింగ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాం. ఆయన డబ్బింగ్ వినడానికి మ్యూజిక్ పనులు కూడా ఆపేసి ప్రత్యేకంగా విన్నాం. ఆయన ఈ సినిమాలో భాగం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ…“అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు గారు ఈ సినిమా చేయడం చాలా సర్ప్రైజ్‌గా అనిపించింది. కశ్యప్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు. తనకి ఎప్పుడూ అదే ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమాతో ఆయన ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొడతారని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.”

డైరెక్టర్ సాయి మార్తాండ మాట్లాడుతూ..తరుణ్ భాస్కర్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్. నా సినిమాలపై ఆయన ఇన్‌స్పిరేషన్ చాలా ఉంటుంది. కశ్యప్ గారికి ఇది బెస్ట్ డెబ్యూ అవుతుందని నమ్ముతున్నాను. శ్రీవిష్ణు గారు చేయడం చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. మే 1న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.”

డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ.. కశ్యప్ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. స్వీకర్ మ్యూజిక్ అదిరిపోయింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు గారు నా ఫేవరెట్ హీరో. ఆయన ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.”

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కశ్యప్ వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్లం. ట్రైలర్‌లో ఆ క్రేజినెస్ కనిపిస్తోంది. తరుణ్ గారు, జేడీ గారు ఇలా అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా చాలా క్రేజీగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇది ‘గాయపడ్డ సింహం’ కాదు… ‘సక్సెస్ రాయబడ్డ సింహం’. మే 1న థియేటర్లలో బ్లాస్ట్ అవుతుంది.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో కశ్యప్ డైరెక్టర్‌గా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. మేమిద్దరం యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం. ఆయనకు ఆల్ ది బెస్ట్. తరుణ్ అన్న నాకు యాక్టింగ్, డైరెక్షన్ రెండింట్లో ఇన్‌స్పిరేషన్. టీమ్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. కశ్యప్ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. స్వీకర్ అగస్తి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా స్పెషల్. ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేసేలా వుంటుంది.

ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. పవన్ ఈ కథ తీసుకొచ్చారు. విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. జేడీ గారు, శ్రీ విష్ణు గారు కథ విని ఫ్రెండ్షిప్‌తో ముందుకు వచ్చి చేశారు. ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ వేడుకకు రోహిత్ గారు రావడం ఆనందంగా ఉంది. కశ్యప్‌కు తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ఉంది. తరుణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనను యాక్టర్‌గా మరింత చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు.

కో-ప్రొడ్యూసర్ దివ్య మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్ మాకు చాలా నచ్చింది. రెండు గంటల పాటు మీ జీవితంలో ఉన్న ఒత్తిడిని మర్చిపోయి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. మే 1న ఈ సినిమా విడుదల అవుతోంది. తప్పకుండా థియేటర్లలో చూడండి.

ప్రొడ్యూసర్ పవన్ సాదినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కశ్యప్ చెప్పిన ఐడియా నాకు చాలా నచ్చింది. ఆయనపై నమ్మకంతో ముందుకు తీసుకెళ్లాం. కశ్యప్ డ్రీమ్‌ను నిజం చేయడానికి మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి వచ్చాం. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం శ్రీ విష్ణు గారిని అడిగితే, ఆయన ఫ్రెండ్షిప్‌తో చేశారు. జేడీ చక్రవర్తి గారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ వైబ్‌తో ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది.

గీత భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీమ్ అందరికీ థాంక్స్. తరుణ్‌కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో తనని హీరోగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి అతనికి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. ఇప్పుడు మళ్లీ యాక్టర్‌గా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. గాయపడ్డ సింహం కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. ఎంత అద్భుతంగా కథ చెప్పారో, అంతే బాగా సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాను చాలా హిలేరియస్‌గా తీశారు. మా నిర్మాతలకు థాంక్స్. పవన్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. తరుణ్ భాస్కర్ చాలా నేచురల్‌గా నటించారు. మా టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.