Skip to content

హరీష్‌ శంకర్‌ విడుదల చేసిన ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’

హరీష్‌ శంకర్‌ విడుదల చేసిన ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ Telugu News
Auto Draft Telugu News

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ట్రైసర్‌ను ప్రముఖ సంచలన దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదల చేశారు. మాస్‌ అండ్‌ ఎమోషన్స్‌, యాక్షన్‌ అంశాలతో ఈ ట్రైసర్‌ అందర్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మెల్టన్‌ మాట్లాడుతూ ” మా ట్రైసర్‌ను విడుదల చేసి మాకు ప్రోత్సాహం అందించిన దర్శకుడు హరీష్‌ శంకర్‌కు ధన్యవాదాలు. భారీ స్థాయిలో, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఈ చిత్రంలో మంచి టాలెంటెడ్‌ నటీనటులు సరికొత్త అవతారంలో కనిపంచబోతున్నారు. ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళంలో అడుగుపెడుతున్నారు. భరత్ కీలక భావోద్వేగ పాత్రలో నటిస్తున్నారు. అమూ అభిరామి, కిశోర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా కోసం అందరూ శారీరకంగా, భావోద్వేగంగా కష్టపడ్డారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తన ప్రత్యేక గాత్రం, సామాజిక అంశాలపై ఆధారిత గీతాలతో యువతలో గుర్తింపు పొందిన వేధన్ పాల్గొనడం ద్వారా చిత్రానికి సాంస్కృతిక, సంగీత పరమైన ప్రత్యేకత కలగనుంది. విభిన్న ప్రదేశాల్లో విస్తృతంగా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది.రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగం, సామాజిక అంశాల సమ్మేళనంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది’ అన్నారు.