నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్…
‘హైకూ’ షూటింగ్ స్టార్ట్.. సినిమాను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ కథలు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
తమిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సినిమాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమాకు ప్రియేష్ గురుస్వామి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా.. శక్తి ప్రణేశ్ ఎడిటర్‌గా, ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటుల విషయానికి వస్తే.. ‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పళ్ల కథానాయికలుగా నటిస్తున్నారు.
అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో ‘హైకూ’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం చూస్తుంటే.. ఈ కంటెంట్‌పై వాళ్ల నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. సినిమా షూటింగ్ డీటెయిల్స్, రిలీజ్ డేట్ తదితర వివరాలను త్వరలో క్రమక్రమంగా వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.


