సరికొత్త కథాంశంతో.. సరికొత్తగా ‘పయనం’ చిత్రం ప్రారంభం
రోటి కపడా రొమాన్స్ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్ హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం 'పయనం' ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్ దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ మా…
