Skip to content

‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి ‘ఆజా మేరీ జాని’ *సాంగ్*విడుద‌ల

అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను…

Read more

‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తోంది – డైరెక్టర్ సాయి మార్తాండ్

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ .…

Read more

“తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ ప్రారంభ0

కన్నడ చిత్ర పరిశ్రమలో 'సుప్రీమ్ స్టార్' గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు". ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. భార్గవ్ బి. వి. దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు…

Read more

విశ్వనాథ్ & సన్స్ – సినిమా సమీక్ష

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’ కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ప్రేమను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఫస్ట్ హాఫ్‌లో సూర్య, రాధిక, మమిత బైజు మధ్య సాగే కుటుంబ సన్నివేశాలు సహజంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా మమిత బైజు తన పాత్రలో చాలా ఫ్రెష్‌గా కనిపిస్తూ, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సూర్యతో ఆమె కాంబినేషన్ కూడా సినిమాకు మంచి ప్లస్‌గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఎమోషనల్‌గా మారుతుంది. ‘అత్తారింటికి దారేది’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తరహా కుటుంబ భావోద్వేగాలను గుర్తు చేసే సందర్భాలు ఉన్నప్పటికీ, దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన…

Read more

హుషారు పిట్టలు – సినిమా రివ్యూ

నటీనటులు: అన్షు, వాసవి గణేషన్, గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, అంజి వల్గుమన్, ప్రణి రెడ్డి తదితరులు దర్శకత్వం: బిక్షు కొయగుర నిర్మాత: వెంకట్ యాదవ్ బ్యానర్: రుద్ర క్రాంతి పిక్చర్స్ సంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కథ, కథనం యూత్, ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలను కలిపి తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’. యువత జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమైనది అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. దర్శకుడు బిక్షు తన చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో…

Read more

అగధ మూవీ రివ్యూ: మిస్టరీ, హారర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం

మిస్టరీ, హారర్, అతీత శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అగధ’. విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని దర్శకుడు ఎం.ఎస్. రాజు ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. సాధారణ హారర్ కథలకు భిన్నంగా మిస్టరీ అంశాలను జోడించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమా ప్రారంభం నుంచే కథలోని రహస్యాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అడవి, గుహలు, చీకటి వాతావరణం వంటి నేపథ్యాలు కథకు సరైన మూడ్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ వాతావరణాన్ని మరింత బలపరిచాయి. కామాక్షి భాస్కర్ల తన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. శ్రవణ్ రెడ్డి కూడా తన పాత్రకు తగినట్లుగా నటించి మెప్పించారు. ఇతర నటీనటులు కూడా కథకు అవసరమైన మేరకు…

Read more

హీరోయిన్ Jo Sharma కు NAFA గుర్తింపు పురస్కారం — కాలిఫోర్నియాలోని NAFA నార్త్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటుడు అజింక్యా దేవ్ చేతుల మీదుగా ప్రదానం

అమెరికన్-ఇండియన్ నటి, M4M కథానాయిక జో శర్మకు ప్రతిష్టాత్మక NAFA Recognition Award లభించింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరిగిన 3వ NAFA నార్త్ అమెరికన్ ఫిల్మ్ అసోసియేషన్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ మరాఠీ దిగ్గజ నటుడు అజింక్యా దేవ్ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. NAFA రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన జో శర్మ, అనంతరం మీడియా లాంజ్‌లో అజింక్యా దేవ్ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో రోహిణి హట్టంగడి, అజింక్యా దేవ్, మహేష్ కోఠారే, గిరీష్ ఓక్, శ్రుతి…

Read more

‘ప్యార్ ప్రేమ క‌ళ్యాణం’ ఆగ‌స్ట్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఎల‌న్‌, శాన్వీ మేఘ‌న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ క‌ళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఎల‌న్ దర్శ‌క‌త్వంలో శ్రీనిధి సాగ‌ర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.. నిర్మాత శ్రీనిధి సాగ‌ర్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు వాడిని. అయితే చెన్నైలో చదువుకున్నాను. అక్కడే సెటిలైయ్యాను. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో నా రెండో సినిమా. ఈ ఏడాది మార్చిలో మేడిన్ కొరియా అనే సినిమాను రిలీజ్ చేశాం. దాని త‌ర్వాత మేం చేసిన సినిమా ఇది. మా తొలి సినిమాలాగానే ఈ సినిమా కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌ని భావిస్తున్నాం. ఓ…

Read more

‘నేను రెడీ’లో ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోతుంది: హీరో హవీష్

హవీష్, కావ్య థాపర్ ‘నేను రెడీ’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘మస్తుగుందిరా యవ్వారం’ లాంచ్ యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రాగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ పాటలో హవీష్, కావ్య థాపర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే రెండో సింగిల్ ‘మెరుపులే మెరుపులే’…

Read more

‘లెనిన్’.. ఒక వారంలోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన సినిమా

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌ణ‌. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి…

Read more