Skip to content

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో మూవీ

ఇండియన్ సినిమా లెజెండ్స్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. వీరు కలిసి నటించే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ మోస్ట్ అవేటెడ్ సినిమాను మన ముందుకు తీసుకురాబోతోంది ప్రెస్టీజియస్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీని నిర్మిస్తోందీ సంస్థ. “KHxRK”వర్కింగ్ టైటిల్ తో ఈ అరుదైన చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అనౌన్స్ చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

70వ దశకంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ తర్వాత తమదైన పంథాలో వెళ్తూ భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దిగ్గజాలుగా ఎదిగారు. ఈ లెజెండ్స్ కలిసి నటించేందుకు ముందుకు రావడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప కథతో నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ సందర్భంగా రెడ్ జెయింట్ మూవీస్ ప్రతినిధి మాట్లాడుతూ – రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ఇద్దరు లెజెండ్స్ తో సినిమా నిర్మించే అవకాశం రావడం మా సంస్థ కల నిజమైన అనుభూతి కలుగుతోంది. 47 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్ లో సినిమా నిర్మించడం గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఇండియన్ సినిమాకు ఇదొక హిస్టారిక్ మూవ్ మెంట్. ఈ ప్రతిష్టాత్మక సినిమా నిర్మాణాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుంటున్నాం. “KHxRK” సినిమాతో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

జైలర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ “KHxRK” సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.