వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి ప్రతిష్టాత్మక వెంచర్…
ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ శాంతి కోసం థాయ్‌లాండ్ కి చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు(మాంక్స్) 22 నుంచి కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుండి తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి తుర్కయాంజిల్ వరకు 17 కిలోమీటర్ల పాదయాత్రలో కింగ్ బుద్ద హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం కింగ్ బుద్ధ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మిస్తున్న డైరెక్టర్ సత్యారెడ్డి మెడలో గౌతమ బుద్ధుడి లాకెట్‌ను ధరింపజేసిన సీనియర్ మాంక్స్ కింగ్ బుద్ధ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాలని ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా సత్యారెడ్డి మాట్లాడుతూ… “అమెరికాలో ప్రారంభించిన “కింగ్ బుద్ద (We Want World Peace)” హాలీవుడ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాము. ఇప్పటివరకు 10 దేశాల్లో షూటింగ్ పూర్తయ్యిందని, ఇంకా 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ ఇండియా ప్రముఖ నటులు నటిస్తున్నారు. ప్రపంచంలోని 100కి పైగా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యం” అన్నారు.
సత్యారెడ్డి మాట్లాడుతూ గత తన “ఉక్కు సత్యాగ్రహం” శతదినోత్సవ చిత్రంలో విప్లవకవి గద్దర్ గారు తనకి బౌద్ధిజం నేర్పించారని,అందుకే ఆ సినిమాలో బుద్ధుని సీన్లు పెట్టమని చెప్పారు.
ఇప్పుడు పూర్తిస్థాయిలో గౌతమ బుద్ధునిపై “కింగ్ బుద్ధ” చిత్రాన్ని నిర్మించడం ఒక గొప్ప ఛాలెంజ్‌గా భావిస్తున్నట్లు తెలిపారు.
థాయిలాండ్, మలేషియాలలో టీజర్, ట్రైలర్ లాంచ్ చేస్తామని; ఢిల్లీ,అమరావతిలలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తామని సత్యారెడ్డి చెప్పారు. పాదయాత్ర ముగింపు వరకు “కింగ్ బుద్ద” చిత్ర యూనిట్ పాల్గొంటుందని
సత్యారెడ్డి తెలిపారు. ప్రపంచ శాంతి కోసం
స్వర్ణభూమి నుంచి బుద్ధభూమి వరకు జరిగే ఈ పాదయాత్రలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరపాలని ఆకాంక్షించారు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఒక డైరెక్టర్‌గా ఎదగడం నాకు గర్వకారణం అన్నారు.
“కింగ్ బుద్ధ” చిత్రం ప్రపంచ శాంతి సందేశంతో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రం బుద్ధుని జీవితం,పంచశీల సిద్ధాంతాలు లక్ష్యంగా రూపొందుతుందన్నారు.
