నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్…
పద్మశ్రీ వరించిన సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టీం

లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్‌కు కేంద్రం తాజాగా పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మురళీ మోహన్‌కి పద్మశ్రీ ప్రకటించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ‘డొక్కా సీతమ్మ’ టీం ఆయన్ను స్వయంగా కలిసి సన్మానించింది.
డొక్కా సీతమ్మ టీం మురళీ మోహన్ ఇంటికి వెళ్లింది. దర్శక, నిర్మాతలు మురళీ మోహన్‌ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని ఆర్టిస్టులు, ఇతర కాస్ట్ క్రూ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో ఆమని నటిస్తుండగా.. ఆమె భర్తగా మురళీ మోహన్ కనిపించనున్నారు. ఈ మూవీని టి.వి. రవి నారాయణ్ తెరకెక్కిస్తుండగా.. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మిస్త్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా చంద్రమౌళి గౌడ్ వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ పాటలు అందించగా, కార్తిక్ కోడకండ్ల సంగీతం సమకూర్చారు. సుచిత్ర చంద్రబోస్ ఈ చిత్రానికి డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
