ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది…
డైరెక్టర్ ఎన్ శంకర్‌ను పరామర్శించిన కేటీఆర్

ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయమ్మ గారు ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శకుడు ఎన్ శంకర్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ‘జై బోలో తెలంగాణ’ సినిమా ద్వారా, గద్దర్ అన్న పాటతో తెలంగాణ అంతటా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన శంకర్ అన్నకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ దశలో ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా తోడుగా ఉంటుంది” అని అన్నారు. అలాగే దశకర్మ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

