ఘనంగా “స్కై” సినిమా నుంచి ‘జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్’ లాంఛ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "స్కై" సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్' లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ - "స్కై" సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి…
