‘శంబాల’ లాంటి చిత్రాల్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు – హీరో ఆది సాయి కుమార్
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ‘శంబాల’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన సంగతులివే.. ‘శంబాల’పై మంచి బజ్ ఏర్పడింది? ఈ చిత్రంపై పెరిగిన అంచనాల గురించి మీరేం చెబుతారు? ‘శంబాల’ చిత్రం బాగా వచ్చింది. ఆడియెన్స్‌కి మా సినిమా బాగా నచ్చుతుంది. అందరూ మా మూవీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను…
