కిష్కింధపురి’కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ లో నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యాపీ మూమెంట్. గురువారం రోజు మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని మొదలైన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్ గా మా…
