నాగబంధం సెకండ్ సింగిల్ “సుర సుర” 19న రిలీజ్
దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్', విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి. 'సుర సుర' పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమా లో ఒక మెయిన్…
