ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘అగధ’
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 'డర్టీ హరి', 'మళ్లీ పెళ్లి' చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన 'అగధ'ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు. 'అగధ' ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు…
