Skip to content

మిరాయ్‌’ నాకు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. మనోజ్ మంచు

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మిరాయ్ ప్రాజెక్ట్ అప్రోచ్ ఎలా జరిగింది? -నాకు కార్తిక్ గారు ఎప్పటినుంచో తెలుసు. అలాగే తేజ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా…

Read more

‘మదరాసి’ బిగ్ స్క్రీన్ పై సెలబ్రేట్ చేసుకునేలా ఉoటుంది: హీరో శివకార్తికేయన్

శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి'. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఫస్ట్ టైం ఎ.ఆర్. మురుగదాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్ గారు. చాలా కూల్ గా ఉంటారు. చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా…

Read more

‘టన్నెల్’ ట్రైలర్ విడుదల

అథర్వా మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడoటే బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టే. ప్రస్తుతం అథర్వా యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్‌లో ‘టన్నెల్‌’ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు. 'యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే' అని ట్రైలర్ లో హీరో చెప్పిన డైలాగ్ చూస్తే టన్నెల్ సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇక ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్…

Read more

బాక్సాఫీస్ నిజమైన ‘ఓజీ’ తిరిగి వచ్చాడు

ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'ఓజీ' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'ఓజీ' తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు…

Read more

లిటిల్ హార్ట్స్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది – హీరో మౌళి తనుజ్

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో మౌళి…

Read more

నటుడు రామచంద్రకు ‘మ‌నంసైతం’ ద్వారా కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం

హైదరాబాద్: తెలుగు సినీ నటుడు, ‘మ‌నంసైతం’ నిర్వ‌హ‌కులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవ‌ల‌ పక్షవాతం రావ‌డంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం…

Read more

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆల్కహాల్' చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. 'ఆల్కహాల్' చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని ఈ టీజర్ సూచిస్తుంది. హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, 'ఆల్కహాల్' రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో నరేష్, పూర్తిగా కొత్త…

Read more

స్లిమ్ గా మారి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బరువు తగ్గి స్లిమ్ గా మారారు. సన్నబడి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఆయన తన కొత్త సినిమా 'మిరాయ్' ప్రమోషన్స్ లో ఈ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'మిరాయ్' సినిమాలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ యానిమేటెడ్ ఇమేజ్, డీటెయిల్స్ ఉన్న టీషర్టులు ధరించిన మంచు మనోజ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. 'మిరాయ్' సినిమా తన కెరీర్ కు మరో మంచి టర్న్ అవుతుందని మనోజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Read more

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” సినిమా నుంచి మ్యాజికల్ లవ్ మెలొడీ సాంగ్ ‘కలలే కలలే’ ఈ నెల 9న రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ సాంగ్ 'కలలే కలలే' రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9న ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట అనౌన్స్…

Read more

‘కొత్త లోక’ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర'. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొత్త లోక 1: చంద్ర'.. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు…

Read more