Skip to content
జూన్ 12న గ్రాండ్‌గా “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” మ్యూజికల్ ఈవెంట్ Telugu News

జూన్ 12న గ్రాండ్‌గా “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” మ్యూజికల్ ఈవెంట్

సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక "ది నైట్ ఆఫ్ ది స్టార్స్" జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి, అలాగే సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి , భార్గవి తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ వేడుకని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనందరం చిన్నప్పటి నుంచి పాటలను మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా ఆస్వాదిస్తూ పెరిగాం…

Read more
సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “రణబాలి” మూవీ Telugu News

సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “రణబాలి” మూవీ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. తాజాగా "రణబాలి" సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రశ్మిక…

Read more
థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం –  ‘ఓ అందాల రాక్షసి’ హీరో  షెరాజ్ మెహదీ Telugu News

థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం – ‘ఓ అందాల రాక్షసి’ హీరో షెరాజ్ మెహదీ

▪️'ఓ అందాల రాక్షసి' మూవీ హీరో, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ ఆవేదన ▪️ రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వ‌లేదు ▪️ చిన్న సినిమాలను చంపేస్తున్న‌ మాఫియా ▪️ ఎక్కువ థియేటర్స్ లో వస్తేనే సినిమా ఓటీటీకి అర్హత దొరుకుతుంది ▪️ న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది హైదరాబాద్‌: తెలుగు సినిమా పరిశ్రమలో మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోంద‌ని 'ఓ అందాల రాక్షసి' హీరో, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిలీజ్ కే కాదు, రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వ‌లేదని ఇవ్వడం లేదని, థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “మంచి సినిమాలను కిల్ చేస్తున్నారు…

Read more
నాగార్జున క్లాప్‌ తో నాగ చైతన్య  ‘దూత 2’  ఘనంగా ప్రారంభం Telugu News

నాగార్జున క్లాప్‌ తో నాగ చైతన్య ‘దూత 2’ ఘనంగా ప్రారంభం

యువ సామ్రాట్ నాగచైతన్య అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘దూత’తో ఓటీటీలో సంచలన అరంగేట్రం చేశారు. ‘దూత’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్ ఫెనామెనాన్‌గా నిలిచింది. తొలి సీజన్ నాగచైతన్యకు డిజిటల్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును తీసుకురావడమే కాకుండా, నటుడిగా ఆయనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, నాగచైతన్య సీక్వెల్ కోసం నిర్మాతగానూ మారుతున్నారు. శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నార. మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కె కుమార్…

Read more
‘స్లమ్ డాగ్’ చిత్రం టీజర్ 8న రిలీజ్ Telugu News

‘స్లమ్ డాగ్’ చిత్రం టీజర్ 8న రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' ఈ చిత్రం ప్రొడక్షన్ విజయవంతంగా పూర్తయింది. అన్ని భాషా వెర్షన్లలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. '33 టెంపుల్ రోడ్' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ఈ ప్రాజెక్ట్ దాని టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ విడుదల నుండి హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'స్లమ్ డాగ్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాతలు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం టీజర్‌ను జూన్ 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు…

Read more
పెద్ది  మూవీకి  అద్భుతమైన  ఓపెనింగ్స్ వచ్చాయి.  నిర్మాత వెంకట సతీష్ కిలారు Telugu News

పెద్ది మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. పెద్ది బాక్సాఫీస్ ఛాంపియన్ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘పెద్ది’ చిత్రం అద్భుతంగా దూసుకుపోతోంది…

Read more
‘సింగ్ గీతం’   సినిమా  ఆడియన్స్‌కు  డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది:  దేవిశ్రీ ప్రసాద్ Telugu News

‘సింగ్ గీతం’ సినిమా ఆడియన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: దేవిశ్రీ ప్రసాద్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారితో సినిమా అనగానే మీ ఫీలింగ్ ఏంటి? -నేను సింగీతం గారికి…

Read more
‘సోల్ ఆఫ్ లెనిన్’కి  అద్భుతమైన స్పందన Telugu News

‘సోల్ ఆఫ్ లెనిన్’కి అద్భుతమైన స్పందన

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. సినీ లవర్స్ ఈ పాట,…

Read more
‘మొహబ్బత్’ చిత్రం ప్రారంభం Telugu News

‘మొహబ్బత్’ చిత్రం ప్రారంభం

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ గారు క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ గారు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు. చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .…

Read more
“సిగ్మా” ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ Telugu News

“సిగ్మా” ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అదిరిపోయింది. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి…

Read more