#చిరుబాబీ2 / #చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు…
