Skip to content

శ్రీ విజయ వారాహి మూవీస్ ప్రొడక్షన్ 1 గ్రాండ్ లాంచ్

  • MOVIES
  • Vishwanath
శ్రీ విజయ వారాహి మూవీస్ ప్రొడక్షన్ 1 గ్రాండ్  లాంచ్ Telugu News

ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది.

ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. రధన్ మ్యూజిక్ అందిస్తుండగా, రామ్ కె మహేష్ డీవోపీ, నార్నీ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్, అనిల్ పసల ఎడిటర్.

మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మూవీ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత మురుకుంట్ల అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి, నా కల మా అబ్బాయి ద్వారా తీరడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి నటన అంటే చాలా పాషన్. ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ దగ్గర, అన్నపూర్ణ స్టూడియోలో రాఘవ్ గారి దగ్గర కూడా నటనలో శిక్షణ పొందాడు. తన ఆసక్తి చూసి సొంతంగా ఒక బ్యానర్ ఏర్పాటు చేసి తనని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాము. అలా శ్రీ విజయ వారాహి బ్యానర్ ని ఏర్పాటు చేశాము. మేము చాలా కథలు విన్నాం. ఫైనల్ గా మా అబ్బాయి మొదటి సినిమాకి కృష్ణ గారు చెప్పిన కథ బావుంటుందని అనిపించింది. చాలా అద్భుతమైన కథ ఇది. మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం. మే నాటికి షూటింగ్ ని పూర్తి చేసుకొని జూలైలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. మొదటిసారిగా చలనచిత్రం రంగంలోకి అడుగుపెడుతున్నాం. మీరు అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను.

నిర్మాత విజయ భారతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా వారి అందరి బ్లెస్సింగ్స్ ఆర్యాకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ బ్యానర్ పై టాలెంట్ ఉన్న అందర్నీ ప్రోత్సహించాలని భావిస్తున్నాము. ఆర్యా కి నటన అంటే ఇంట్రెస్ట్ ఉందని తెలియగానే మేము చాలా ప్రోత్సహించాం. ముంబైలో, సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర అలాగే అన్నపూర్ణ స్టూడియోలో కూడా అతను శిక్షణ తీసుకున్నాడు. డైరెక్టర్ కృష్ణ గారికి కూడా తను ఈ పాత్రకి సరిపోతాడంటేనే తీసుకోమని చెప్పాము. ఒకరోజు డెమో షూట్ చేశారు. 100% తను ఒక మంచి నటుడని అనిపించాకే తీసుకున్నారు. మా సంస్థ ద్వారా కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తాము.

దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను ఇంతకుముందు రెక్కి అనే వెబ్ సిరీస్ చేశాను. అలాగే మరికొన్ని ఓటిటి చానల్స్ కి వెబ్ సిరీస్ లు చేశాను.ఇది పెద్ద కథనే అనుకున్నాం. ఒక కొత్త హీరోని పరిచయం చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు చేసే ఈ కథని సిద్ధం చేశాం. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. టౌన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. మార్చిలో షూట్ కి వెళ్తాం. జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము.

దశరథ్ మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ గారు నాకు చాలా ఏళ్లుగా మంచి మిత్రుడు. టీవీ, ఓటీటీ కంటెంట్ విషయంలో తన మంచి దిట్ట. తన రెక్కీ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్. దర్శకుడుగా తను ఎక్కడ రాజీ పడకుండా డైరెక్షన్ చేస్తారు. అలాగే హీరో ఆర్య చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అందరిని అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

హీరో ఆర్యా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి వచ్చి నన్ను బ్లెస్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు ఇది అద్భుతమైన మూమెంట్. ఇదే స్టేజ్ మీద రెండేళ్ళ క్రితం నాటకం ప్రదర్శించాను. అది చూసిన మా అమ్మ నాన్న నన్ను నటుడిగా ఎంతగానో ప్రోత్సహించారు. నాకు ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

నటీనటులు: ఆర్యా, దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ, మణికందన్ ఆర్. ఆచారి, సాయిరాజ్

టెక్నికల్ టీం:
బ్యానర్: శ్రీ విజయ వారాహి మూవీస్
నిర్మాతలు: మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి
కథ, కధనం & దర్శకత్వం: పోలూరు కృష్ణ
సినిమాటోగ్రాఫర్: రామ్ కె మహేష్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: నార్నీ శ్రీనివాస్
ఎడిటర్: అనిల్ పసల
లిరిక్ రైటర్స్: సురేష్ బనిశెట్టి, శ్రీరామ్ తపస్వి
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.