Skip to content

“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు

“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు Telugu News
“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు Telugu News

సుడిగాలి సుధీర్ హీరోగా “సుధీర్ జోకర్” అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా “సుధీర్ జోకర్” సినిమా బ్యాంగర్ రిలీజ్ చేశారు. అభిమానుల సందడి మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

డీవోపీ అహ్మద్ షెరీఫ్ మాట్లాడుతూ – ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ సునీల్, ప్రొడ్యూసర్ విజయ్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ గా సునీల్ కు ఈ సినిమాకు డీవీపీగా తీసుకునేందుకు చాలా ఆప్షన్స్ ఉండేవి, అయినా నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. అన్నారు.

ప్రొడ్యూసర్ విజయ్ డొంకాడ మాట్లాడుతూ – పరదా సినిమా తర్వాత ఎలాంటి కథతో మూవీ చేయాలని ప్లాన్స్ లో ఉన్నాం. ఆ టైమ్ లో సునీల్ ఈ మూవీ కథ చెప్పారు. డైరెక్టర్ సునీల్ కథ చెప్పగానే ఈ మూవీ తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాం. సుధీర్ 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కష్టపడుతున్నాడు. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా ఉంటుంది. దర్శకుడు సునీల్ ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కించాడు. డీవోపీ అహ్మద్ చాలా ఇన్వాల్వ్ అయి వర్క్ చేశారు. 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యింది. త్వరలో మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఈ క్రమంలో మాకు సుధీర్ ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అన్నారు.

డైరెక్టర్ పీఎస్ సునీల్ పుప్పాల మాట్లాడుతూ – ప్రొడ్యూసర్స్ ఈ కథ ఓకే చేశాక సినిమాకు కావాల్సినంత బడ్జెట్ పెడతారా లేదా అనిపించింది. కానీ వాళ్లు ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అనేది ఆ తర్వాత తెలిసింది. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. సుధీర్ అన్న ఇచ్చిన సపోర్ట్, కాన్ఫిడెన్స్ ను మర్చిపోలేను. మరే హీరో అయినా నన్ను ఇంతలా నమ్మేవారు కాదు. కల్యాణ్ గారి ఫ్యాన్స్ కు ఓజీ సినిమా ఎలాగో సుధీర్ గారి ఫ్యాన్స్ కు సుధీర్ జోకర్ సినిమా అలా. మా టీమ్ అందరి గురించి నెక్ట్స్ ఈవెంట్స్ లో చెప్తాను. అన్నారు.

హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – నా బర్త్ డేను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం అలవాటు. ఈ సారి మాత్రం నా కుటుంబ సభ్యులుగా మారిపోయిన ఫ్యాన్స్ తో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ బర్త్ డే చాలా స్పెషల్ గా ఉంటుందని గట్టిగా అనిపిస్తోంది. సుధీర్ జోకర్ సినిమా బ్యాంగర్ రిలీజ్ తో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ స్పెషల్ గా మారిపోయాయి. సునీల్ నా దగ్గరకు కథ తీసుకొచ్చినప్పుడు బాగా నచ్చింది. అయితే కథ చెప్పినంత బాగా సినిమా చేయగలడా అనుకున్నాను. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. విజయ్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమాకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. డీవోపీ అహ్మద్ నేను ఇంత బాగా కనిపిస్తానా స్క్రీన్ మీద అనేంత బ్యూటిఫుల్ గా విజువల్స్ ఇచ్చారు. వీళ్లంతా నా టీమ్, వారి గురించి మరిన్ని ఈవెంట్స్ లో మాట్లాడుతా. లియోన్ జేమ్స్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ బ్యాంగర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే కాదు నా ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ కూడా. ఈ బ్యాంగర్ నేను కూడా మీతో పాటే చూశాను. బ్యాంగర్ చాలా బాగుంది. చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా. అన్నారు.

“సుధీర్ జోకర్” మూవీ బ్యాంగర్ ఎలా ఉందో చూస్తే – నగరంలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. ఈ చోరీలు ఎవరు చేస్తున్నారనే ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. ఓ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన యువకుడే దొంగ అని తెలుస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది ఆసక్తి కలిగిస్తోంది. బ్యాంగర్ లో టాప్ క్వాలిటీ విజువల్స్, బీజీఎం, షాట్ మేకింగ్ ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ ఈ బ్యాంగర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే క్యూరియాసిటీ “సుధీర్ జోకర్” బ్యాంగర్ కలిగిస్తోంది.

నటీనటులు – సుడిగాలి సుధీర్, అయేషా, అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————
ప్రొడక్షన్ డిజైనర్ – విఠల్ కోసనం
కాస్ట్యూమ్ డిజైనర్ – చిన్మయి కకిలేటి
ఎడిటిర్ – ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ – అహ్మద్ షెరీఫ్
మ్యూజిక్ – లియోన్ జేమ్స్
ప్రొడ్యూసర్స్ – విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ
స్క్రిప్ట్, డైరెక్షన్ – పీఎస్ సునీల్ పుప్పాల
డిజిటల్ మార్కెటింగ్ – హాష్ ట్యాగ్ మీడియా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)