“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు
సుడిగాలి సుధీర్ హీరోగా "సుధీర్ జోకర్" అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా "సుధీర్ జోకర్" సినిమా బ్యాంగర్ రిలీజ్ చేశారు. అభిమానుల సందడి మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవోపీ అహ్మద్ షెరీఫ్ మాట్లాడుతూ - ఈ…
