Skip to content

“సుధీర్ జోకర్” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

“సుధీర్ జోకర్” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ Telugu News

సుడిగాలి సుధీర్ హీరోగా “సుధీర్ జోకర్” అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

రేపు హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ రోజు “సుధీర్ జోకర్” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్లేయింగ్ కార్డ్స్ తో ఉన్న సుడిగాలి సుధీర్ ఆకట్టుకుంటున్నారు. రేపు ఈ సినిమా బాంగర్ రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా జరగబోతోంది. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా “సుధీర్ జోకర్” సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – సుడిగాలి సుధీర్, అయేషా, అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా,విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————
ప్రొడక్షన్ డిజైనర్ – విఠల్ కోసనం
కాస్ట్యూమ్ డిజైనర్ – చిన్మయి కకిలేటి
ఎడిటిర్ – ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ – అహ్మద్ షెరీఫ్
మ్యూజిక్ – లియోన్ జేమ్స్
ప్రొడ్యూసర్స్ – విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ
స్క్రిప్ట్, డైరెక్షన్ – పీఎస్ సునీల్ పుప్పాల
డిజిటల్ మార్కెటింగ్ – హాష్ ట్యాగ్ మీడియా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.