‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’ . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ చూపించారు. ఇక త్వరలోనే ఆడియో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది…
