నటుడు & సేవామూర్తిగా అఫ్సర్ ఆజాద్
హైదరాబాద్: ఒకవైపు వెండితెరపై తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు నిజ జీవితంలో పేదలకు అండగా నిలుస్తున్నారు ప్రముఖ నటుడు, సామాజికవేత్త అఫ్సర్ ఆజాద్. స్వయంకృషితో వ్యాపారవేత్తగా ఎదిగి, సినిమాల్లో సత్తా చాటుతూ, సేవా కార్యక్రమాలతో సమాజానికి తన వంతు తిరిగి ఇస్తున్న అఫ్సర్ ఆజాద్ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. నేపథ్యం, విద్యాభ్యాసం అఫ్సర్ ఆజాద్ 1983 జూన్ 5న వికారాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎండి బాబుమియా, రజియాబేగం. బీఏ (B.A) వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, చిన్న వయసులోనే బాధ్యతలు భుజాన వేసుకుని శ్రమను నమ్ముకున్నారు. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి.. 1998లో తన 15వ ఏటనే మోతీనగర్‌లో ఓ సమోసా కంపెనీని ప్రారంభించి వ్యాపార రంగంలోకి…
