సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘అగధ’
కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వచ్చే వారం (సెప్టెంబర్ 25) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్‌గా ‘అగధ’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, డివైన్, మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’…
