మైత్రి మూవీ మేకర్స్ ద్వారా “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ఆంధ్ర-తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్
మలయాళ సినిమాలో మొట్టమొదటి పూర్తి నిడివి గల WWE-జానర్ యాక్షన్-కామెడీ చిత్రం “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను ప్రముఖ తెలుగు నిర్మాణ-పంపిణీ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా రిలీజ్ చేయనుంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ చిత్రం కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించగా, రీల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థను ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్‌మన్ గ్రూప్ కలిసి ఏర్పాటు చేశాయి. రమేష్, రితేష్ రామకృష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్ మరియు సునీల్ సింగ్‌లు ఈ వెంచర్లో కీలక భాగస్వాములు. అర్జున్…
