32.15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “లిటిల్ హార్ట్స్”
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్…
