‘హాఫ్’కు TIFFలో అరుదైన ఘనత.. మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్‌లో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా రికార్డ్
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లోని ప్రతిష్ఠాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలోకి మలయాళ సినిమా ఘనంగా అడుగుపెట్టింది. సమ్జాద్ పి.ఎస్. దర్శకత్వం వహించిన ‘హాఫ్’ (HALF) ఈ విభాగంలో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చిత్ర ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పూర్తైన తర్వాత జరిగిన Q&A సెషన్‌లోనూ థియేటర్‌లో అదే ఉత్సాహం కొనసాగింది. ఫ్రాగ్రంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆన్ సజీవ్, పి.కె. సజీవ్ నిర్మించిన ‘హాఫ్’.. రా, డిస్టింక్టివ్, ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రదర్శన సమయంలో పలు సందర్భాల్లో థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగింది. చిత్రంలోని ఇంటెన్స్ వరల్డ్, డిఫరెంట్ ప్రజెంటేషన్ ప్రేక్షకులపై బలమైన ముద్ర…
