‘విశ్వంభర’ నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ స్టూడియోలు వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ను విడుదల చేశారు. పోస్టర్‌లో చిరంజీవి ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మెటాలిక్ త్రిశూలం మరింత పవర్‌ను తీసుకొచ్చింది. ఈ లుక్ సినిమాలోని దైవత్వం, వీరత్వంతో కూడిన ప్రపంచాన్ని ప్రజెంట్ చేస్తోంది. మరోవైపు సెన్సేషనల్ కంపోజర్ గౌర హరి అందించిన OST…
