‘హైందవ’ కీలక షెడ్యూల్ పూర్తి
'కిష్కింధపురి'తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ 'హైందవ' లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు తమ నాల్గవ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం…
