‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్
మాచో స్టార్ టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్స్తో రూపొందించిన గ్లింప్స్, క్రీ.శ. 642 నాటి నేపథ్యంలో వచ్చిన టైటిల్ టీజర్, పవర్ఫుల్ తొలి పాట ‘వీర జయధీర’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు. ‘అమ్మ కదిలి వచ్చె’ పేరుతో విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. పాట పేరుకు…
