‘పెద్ది’ నుంచి అప్పలసూరి పాత్రలో జగపతి బాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గర్వంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న 'పెద్ది' ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను…
