‘హల్కా డాన్’గా ప్రమోద్
రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా ప్రమోద్‌కి మంచి క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘లెనిన్’ చిత్రంతో దగ్గరయ్యారు. అలాంటి ప్రమోద్ ఇప్పుడు హీరోగా ‘హల్కా డాన్’ అంటూ రాబోతోన్నారు. కన్నడ, తుళు, తెలుగు భాషల్లో ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ కట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ పూర్తిగా మాస్, యాక్షన్ లవర్స్‌కి ట్రీట్‌లా ఉంది. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే, వారు మెచ్చే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను కట్ చేశారు. ప్రమోద్ రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్నీ కూడా సరికొత్తగా ఉన్నాయి. సరికొత్త మాస్…
