“తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ ప్రారంభ0
కన్నడ చిత్ర పరిశ్రమలో 'సుప్రీమ్ స్టార్' గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు". ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. భార్గవ్ బి. వి. దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు…
