ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించబడ్డాయి. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా…
