‘దేవరాయ’- శ్రీకృష్ణదేవరాయగా మజెస్టిక్ అవతార్‌లో అదరగొట్టిన కిచ్చా సుదీప
అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ స్పెక్టాకిల్ ‘దేవరాయ’ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. విజయనగర సామ్రాజ్యంలోని దిగ్గజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌ను మేకర్స్ మజెస్టిక్ అవతార్‌లో పరిచయం చేశారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోపై ప్రియ సుదీప్ సమర్పిస్తున్నారు. 'దేవరాయ’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమా ప్రపంచాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. భారీ స్థాయిలో, చారిత్రక వైభవంతో తెరకెక్కుతున్న సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్స్‌తో పాటు గౌర హరి అందించిన పవర్‌ఫుల్, మజెస్టిక్ స్కోర్ అనుభూతిని మరింత ఎలివేట్ చేసింది. రాజసంతో కూడిన అవతార్‌లో సుదీప్ అద్భుతమైన…
