Skip to content

ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ (Arere.. Arere..) మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజర‌య్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు, మిమిక్రి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఆడియోను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ… “దియా ఒక వండర్‌ఫుల్…

Read more

‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్

▪️పాటలు విడుదల చేసిన వీఎన్ ఆదిత్య ▪️ చిత్రంలోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి ₹ లక్ష బహుమతి ప్రకటన హైద‌రాబాద్: తెలుగు తెరపై స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ ద‌ర్శ‌క‌త్వంలో, పార్ధ గోపాల్ - మేఘ‌న జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న…

Read more

పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

▪️*తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుకు ఎంపికైన బ‌యోపిక్* ▪️ *ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన* ▪️ *చిత్ర‌యూనిట్‌ను ప్ర‌శంసించిన ప్ర‌ముఖులు* హైద‌రాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు. తాజాగా చిత్ర‌యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక…

Read more

బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

▪️సినీ ప్రముఖుల సమక్షంలో కన్నడ వెర్షన్ టీజర్ విడుద‌ల‌ ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు ▪️ 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ బెంగళూరు: సౌతిండియా ప్రేక్ష‌కుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ క‌ల‌గ‌లిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది. ఈ వేడుకకు ‘దేవి’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్…

Read more

హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ శ్రీకాకుళంలో ప్రారంభం

▪️ 53వ బ్రాంచీ లాంచ్ చేసిన‌ ‘క‌ల‌ర్స్ హెల్త్‌కేర్’ ▪️ అట్టహాసంగా ప్రారంభోత్స‌వ వేడుక‌ ▪️ ఆధునిక టెక్నాల‌జీతో 'కలర్స్ 2.0' ట్రీట్‌మెంట్ -అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలర్స్ వెల్నెస్ లో సేవలు:-కలర్స్ యాజమాన్యం శ్రీకాకుళం:- ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ (Kolors)’ తన నూతన బ్రాంచ్ కలర్స్ 2.0ను ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం న‌గ‌రంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన ‘కలర్స్ (Kolors) హెల్త్‌కేర్’ నూత‌న బ్రాంచీని హీరోయిన్‌ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అందం పొందవచ్చని అన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా…

Read more

‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్

▪️ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" ▪️ లాంచ్ చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ▪️ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంట‌పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. "ప్రేమ ఓ…

Read more

‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం

▪️ ఫిలింనగర్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు ▪️ కీలక పాత్రలో ప్రముఖ నటి ఇంద్రజ హైదరాబాద్: భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్ కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ, “స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా…

Read more

ఘనంగా ఆదిభట్ల నారాయణదాసు 81వ వర్ధంతి ఉత్సవాలు

హరికథా గానంతో అలరించిన కళాకారులు హైదరాబాద్: శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ శృంగేరి శారద శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస వరేన్యుల 81వ వర్ధంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జ‌రిగాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన 'రామాయణ హరికథా సప్తాహం' ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యాన్ని నింపింది. కళాకారులకు అండగా కరాటే కళ్యాణి కార్యక్రమ నిర్వాహకురాలు, శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, నటి కరాటే కళ్యాణి చేస్తున్న కృషిని ప్రముఖ నటులు సుమన్ తల్వార్ కొనియాడారు. అంతరించిపోతున్న హరికథా కళారూపాన్ని కాపాడటంలో కళ్యాణి ముందుంటున్నారని, తన తండ్రి స్ఫూర్తితో ఏటా…

Read more

గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో ‘రిమ్‌జిమ్’ మూవీ

▪️‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా ▪️ నిజ సంఘటనల ఆధారంగా ‘రిమ్‌జిమ్’ ▪️ న‌టించి పాట‌లు పాడిన‌ రాహుల్ సిప్లిగంజ్ ▪️ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ ద‌ర్శ‌క‌త్వంలో, సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతోంది. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. AV సినిమాస్ , సి…

Read more

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ''గత క‌మిటీలో దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న క‌మిటీలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని…

Read more