Skip to content
#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం Telugu News

#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం

హీరో టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రం #గోపీచంద్34 ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలమైన కథాంశాలతో కూడిన చిత్రాలను అందించడంలో పేరుపొందిన '70mm ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత KL దామోదర్…

Read more
#గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం Telugu News

#గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం

హీరో టీ గోపీచంద్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘భరత వర్ష’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న ఆయన, ఇప్పుడు తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వివెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. వినూత్న కథలతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి సినిమాలు చేయడంలో పేరుగాంచిన ఈ బ్యానర్, మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌ను తీసుకువస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అగ్ని వర్ణంలో ఆకాశం, సూర్యుడు, ఒక కొండపై గర్వంగా నిలబడి ఉన్న నల్ల పాంథర్.…

Read more