‘ది రెడ్ బ్యాగ్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – మంత్రి టీజీ భరత్
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో.. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ అద్భుతంగా ఉంది. మా…
