పవన్ కళ్యాణ్ హీరోగా ‘పురుష:’ చిత్రీకరణ పూర్తి
కంటెంట్ ఈజ్ కింగ్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కంటెంట్‌లో హాస్య భరితమైన చిత్రాలు ఎవర్ గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీతో పాటుగా, సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు అయితే ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఆడియెన్స్‌కు అందించనున్నారు. పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు. ఈ…
