కంటెంట్ ఈజ్ కింగ్ అని హుషార్ పిట్టలు నిరూపించింది: నిర్మాత వెంకట్ యాదవ్
తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్ సాధించిన హుషార్ పిట్టలు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేశాయి. ఆగస్టు 15న ఈ చిత్రం అనూహ్యమైన ఓపెనింగ్స్‌తో, అద్భుతమైన మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తొ బ్లాక్‌బస్టర్ విజయంగా నిలిచింది. తొలివారంలో ఈ చిత్రం 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ను సాధించి విజయవంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ…
