రవి తేజ ‘ఇరుముడి’ షూటింగ్ 50 శాతం పూర్తి
మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ పవర్హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్ల ఫస్ట్ లుక్ను పోస్టర్ను విడుదల చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్లను ప్రేక్షకులు చూడబోతున్నారని…
