Skip to content

‘నాగబంధం’ జూలై 3న గ్రాండ్ రిలీజ్

‘నాగబంధం’ జూలై 3న గ్రాండ్ రిలీజ్ Telugu News

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. వర్షాకాలం ప్రారంభంలోనే విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.

ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక కింది భాగంలో మోడ్రన్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆడియెన్స్‌‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. శివుడిగా విరాట్ లుక్‌కి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్ అయితే నెక్ట్స్ లెవెల్లో ఉంది.

ఈ చిత్రం ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టనుంది. ఇకపై వరుస అప్డేట్లతో ప్రేక్షకుల్లో మరింత బజ్‌ను పెంచేలా టీం ప్లాన్ చేస్తోంది.

విలక్షణమైన ఇతివృత్త సమ్మేళనం, భారీ నిర్మాణ స్థాయి, శక్తివంతమైన కథా లక్ష్యంతో, ‘నాగబంధం’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఏడాదిలో అత్యంత ఆకట్టుకునే థియేట్రికల్ చిత్రాలలో ఒకటిగా ‘నాగబంధం’ నిలవనుంది.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: జునైద్ కుమార్ – అభే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
VFX డైరెక్టర్: అభిషేక్ నామా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
కాస్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, చలమక్లా విభా రెడ్డి, శశి చౌదరి
యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రిమ్‌బర్గ్ (USA), రియల్ సతీష్, కెచా ఖంఫక్డీ, నందు, రన్ నవరాచ్ (థాయ్‌లాండ్), జూనియర్ వెంకట్.
కొరియోగ్రఫీ: బృందా, గణేష్ ఆచార్య, శ్రస్తి వర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
DI: రెడ్ చిల్లీస్
కలరిస్ట్: కెన్ మెర్జ్కర్
DTS & Atmos: M.R. రాజాకృష్ణన్
VFX క్రియేటివ్ డైరెక్టర్: అభిషేక్ నామా
చీఫ్ కో-డైరెక్టర్: లలిత్ ప్రభాకర్ నాగ్ సూర్యదేవర
కో-డైరెక్టర్: వెంకర్ రెడ్డి కుంచం
అసోసియేట్ డైరెక్టర్లు: రమేష్ రావూరి, పెదబలి నిఖిలేశ్వర్ రెడ్డి
సహాయ దర్శకులు: రూప్‌కుమార్ మగాపు, ఎ. సుధీర్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: రాఘవ, గణేశుని వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు: దూలం రమేష్, ఎండీ జాఫరుద్దీన్
ప్రొడక్షన్ మేనేజర్స్: బోయపాటి సతీష్, ఆనం నవీన్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోలు
స్టిల్స్: స్నాపిన్ ఫోటోగ్రఫీ శివ
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
PRO: వంశీ-శేఖర్

See also  అఖండ 2: తాండవం' బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్ ని పరిచయం చేస్తున్న తమన్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.