Skip to content

‘బైకర్’ మూవీని ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్

‘బైకర్’ మూవీని  ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్ Telugu News
‘బైకర్’ మూవీని  ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్ Telugu News

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ రెడ్డి సమర్పణలో ఈ మూవీని అభిలాష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రని పోషించగా.. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మదనపల్లిలోని మిట్స్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

శర్వానంద్ మాట్లాడుతూ .. ‘జీవితం అనేది సినిమాలాంటిది కాదు. జీవితంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు.. కానీ స్ట్రగుల్స్ మాత్రం ఉంటాయి. జీవితంలో కన్ఫ్యూజర్, క్రైయింగ్, లోన్లీ స్టేజ్ అనేవి కచ్చితంగా ఉంటాయి. వీటిని ప్రతీ ఒక్కరూ దాటుకుని రావాల్సిందే. నేనూ ఇవన్నీ దాటుకునే వచ్చాను. నేను బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. నేను ఎందుకూ పనికి రాను అని అందరూ తిట్టేవాళ్లు. హీరో అవుతాను అంటే.. ఎవ్వరూ నమ్మలేదు. చాలా మంది అవమానించారు. 23 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ‘బైకర్’ నా కెరీర్‌లో 36వ చిత్రం. జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామని అనుకుంటే అందరూ అడ్డుకట్ట వేస్తుంటారు. కానీ ఎవ్వరి మాట వినొద్దు. పెద్ద కలలు కనండి. తలుచుకుంటే ఏదైనా చేయగలం. నిరుత్సాహ పరిచేలా ఎవరైనా మాట్లాడితే వారి మాటలు వినొద్దు. నేనే చేయగలిగాను అంటే మీరు (విద్యార్థులు) ఏదైనా సాధించగలరు. మన సక్సెస్‌తోనే అందరికీ సమాధానం చెప్పాలి. కష్టంలో ఉండే స్నేహితులు, వదిలేసిన వాళ్లని, కష్టపెట్టిన వాళ్లని మర్చిపోకండి. అందరినీ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ కూడా ఉండాలి. జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి. పక్కవారితో పిల్లల్ని ఎప్పుడూ పోల్చొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా సాధిస్తారు. ‘బైకర్’ సినిమా ఏప్రిల్ 3న రాబోతోంది. ప్రతీ ఒక్క స్టూడెంట్ తప్పకుండా ఫాదర్‌తో కలిసి ఈ మూవీని చూడండి. సంక్రాంతికి చెప్పి హిట్టు కొట్టా. సమ్మర్‌కి వస్తున్నా.. మళ్లీ హిట్టు కొడతా’ అని అన్నారు.

మాళవిక నాయర్ మాట్లాడుతూ .. ‘మా ‘బైకర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. కాలేజ్ అని జీవితంలో ఓ గొప్ప దశ. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన తరువాత అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవితంలో ఎత్తుపల్లాలు అనేది సహజం. ఎప్పుడూ ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండాలి. ‘బైకర్’లో కూడా ఇలాంటి సందేశమే ఉంటుంది. అందరిలోనూ స్పూర్తినింపేలా ఉంటుంది. మా సినిమా ఏప్రిల్ 3న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

See also  కన్యాకుమారి ఆడియన్స్ కు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: మధు షాలిని

తారాగణం: శర్వానంద్, డాక్టర్ రాజశేఖర్, మాళవిక నాయర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
సమర్పణ: విక్రమ్ రెడ్డి
నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం: గిబ్రాన్ వైబోధ
బ్యానర్: యువి క్రియేషన్స్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ పసల
ఆర్ట్ డైరెక్టర్: ఎ పన్నీర్ సెల్వం
రచయితలు: ఎం.వి.ఎస్. భరద్వాజ్, శ్రావణ్ మాదాల
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, శేఖర్ VJ, విశ్వ రఘు
విన్యాసాలు: దిలీప్ సుబ్బరాయన్
లైన్ ప్రొడ్యూసర్: సురేష్ వట్టిగుంట
క్రియేటివ్ హెడ్: అనిల్ కుమార్ ఉపాధ్యాయుల
PRO : వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.